కోహ్లీ, స్మృతి మందానాకు సియెట్ అవార్డులు

Tue,May 14, 2019 12:54 PM

Virat Kohli, Smriti Mandhana named international cricketers of year

హైద‌రాబాద్‌: కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు ద‌క్కింది. సియెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌ను సోమ‌వారం ప్ర‌క‌టించారు. మ‌హిళా క్రికెట‌ర్ స్మృతి మందానా కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ వుమెన్ క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ బ్యాట్స్‌మెన్ కేట‌గిరీలోనూ కోహ్లీకి అవార్డు ద‌క్కింది. స్పీడ్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాను బెస్ట్ బౌల‌ర్ అవార్దు వ‌రించింది. ఇంట‌ర్నేష‌న‌ల్ టెస్ట్ క్రికెట‌ర్ ఆఫ్ ఇయ‌ర్ అవార్డు చ‌తేశ్వ‌ర్ పుజారాకు ద‌క్కింది. అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్ అవార్డు రోహిత్ శ‌ర్మ వ‌శ‌మైంది. టీ20 ప్లేయ‌ర్ అవార్డు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఆర‌న్ ఫించ్‌కు ద‌క్కింది. అత్య‌ద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన క్రికెట‌ర్‌ అవార్డు కుల్దీప్ యాద‌వ్‌ను వ‌రించింది. ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20 బౌల‌ర్ అవార్డు ఆఫ్ఘ‌నిస్తాన్‌కు చెందిన ర‌షీద్ ఖాన్‌కు ద‌క్కింది. మోహింద‌ర్ అమ‌ర్‌నాథ్‌కు లైఫ్ టైమ్ అచీవ‌మెంట్ అవార్డు ద‌క్కింది.

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles