టెస్టు మ్యాచ్ మధ్యలో విరాట్ డ్యాన్స్..: వీడియో

Sat,December 8, 2018 01:12 PM

Virat Kohli shows off his dancing skills in tense Test at Adelaide Oval

అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత ఆటగాళ్లు అంచనాలకు తగ్గట్లుగానే రాణిస్తున్నారు. బౌలర్లు వీరోచిత ప్రదర్శన చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 235 పరుగులకే ఆలౌటైంది. ఆతిథ్య ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేయడంతో కోహ్లీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. మూడో రోజు ఆటలో మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ డ్యాన్స్ చేశాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఉత్సాహంగా స్టెప్పులేస్తుండగా మైదానంలోని కెమెరాలు ఈ దృశ్యాన్ని వీడియో తీశాయి. ఈ వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. శనివారం మార్నింగ్ సెషన్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో 45 నిమిషాల పాటు అటకు అంతరాయం కలిగింది. ఆట ప్రారంభమైన తర్వాత ఓవర్‌నైట్ స్కోరు 191/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 235 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 15 పరుగుల ఆధిక్యం లభించింది.5063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles