Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ధోనీ, రోహిత్‌తో పోలికా.. కోహ్లిని కెప్టెన్‌గా కొనసాగించడమే ఎక్కువ!

Tue,March 19, 2019 02:49 PM

Virat Kohli should be grateful to RCB franchise for letting him lead the team says Gambhir

న్యూఢిల్లీ: ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా కొనసాగించడమే ఎక్కువని, దానికి అతడు కృతజ్ఞతలు చెప్పుకోవాలని గౌతమ్ గంభీర్ అన్నాడు. టీమ్ ఎంత చెత్త ప్రదర్శన చేసినా.. కెప్టెన్‌గా కోహ్లినే కొనసాగించడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డాడు. ఏడెనిమిదేళ్ల నుంచి ఆ టీమ్‌కు కోహ్లి కెప్టెన్సీ వహిస్తున్నా.. ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. అదే సమయంలో మూడేసిసార్లు ఐపీఎల్ గెలిచిన ధోనీ, రోహిత్‌లతో కోహ్లిని పోల్చవద్దని కూడా గంభీర్ స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా కోహ్లి చేయాల్సింది చాలా ఉంది. అతనో తెలివైన కెప్టెన్ అని నేను అనుకోను. ఇప్పటివరకు ఐపీఎల్ గెలవలేదు. ట్రోఫీ గెలిస్తేనే కెప్టెన్‌గా అతడు సక్సెసైనట్లు. ధోనీ, రోహిత్‌లాంటి వాళ్లు ఇప్పటికే మూడేసి సార్లు ట్రోఫీ గెలిచారు. కోహ్లిని ఆ ఇద్దరితో పోల్చొద్దు. గత ఏడెనిమిదేళ్ల నుంచి కెప్టెన్‌గా ఉన్నా ఒక్కసారీ గెలవలేదు. అతన్ని కెప్టెన్‌గా కొనసాగించడమే చాలా గొప్ప విషయం. దీనికి ఆ ఫ్రాంచైజీకి కోహ్లి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇతర కెప్టెన్లు ఇన్ని అవకాశాలు దక్కలేదు అని గంభీర్ అన్నాడు. కోహ్లి కెప్టెన్సీలో ఆర్సీబీ టీమ్ ఇప్పటివరకు 96 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 44 మాత్రమే గెలిచింది. అయితే తప్పుడు నిర్ణయాలే ఆర్సీబీ టీమ్ వైఫల్యాలకు కారణమని కోహ్లి చెప్పాడు.

4007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles