చరిత్ర సృష్టించిన కోహ్లి

Tue,January 22, 2019 12:18 PM

Virat Kohli scripts history by becoming first player to grab 3 top awards of ICC

దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మూడు అత్యున్నత అవార్డులు గెలిచిన తొలి ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లి గెలుచుకున్నాడు. అంతేకాదు.. ఐసీసీ టెస్టు, వన్డే టీమ్స్‌కు కెప్టెన్‌గా కూడా కోహ్లియే నిలవడం విశేషం. 2018లో బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా విరాట్ అత్యున్నత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. గతేడాది 13 టెస్టుల్లో 55.08 సగటుతో కోహ్లి 1322 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇక 14 వన్డేల్లో 1202 పరుగులు చేశాడు. సగటు 133.55 కాగా.. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. పది టీ20ల్లో 211 పరుగులు చేశాడు.


ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయ‌ర్‌లో ముగ్గురు ఇండియ‌న్స్‌కు చోటు ద‌క్కింది. కోహ్లితోపాటు వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌, పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ఈ టీమ్‌లో ఉన్నారు.
ఇక వ‌న్డే టీమ్ ఆఫ్ ద ఇయ‌ర్‌లో న‌లుగురు ఇండియ‌న్స్ ఉన్నారు. కెప్టెన్ కోహ్లి కాకుండా రోహిత్ శ‌ర్మ‌, కుల్‌దీప్ యాద‌వ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా చోటు సంపాదించారు.

4147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles