ఉగ్రదాడి: అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసిన కోహ్లీ

Sat,February 16, 2019 01:36 PM

Virat Kohli postpones Indian Sports Honours as a 'mark of respect' to CRPF

ముంబై: పుల్వామా ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో ఇవాళ జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అమర జవాన్ల గౌరవార్థం శనివారం జరగాల్సిన క్రీడాకారుల అవార్డుల ప్రదానోత్సవాన్ని నిలిపివేశారు. ఆర్పీ- సంజీవ్ గోయెంకా గ్రూప్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ప్రతిఏటా వివిధ క్రీడల్లో గొప్పగా రాణించిన క్రీడాకారులకు అవార్డులు అందజేస్తున్నారు. ఈ విషాద సమయంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఆదివారం అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని కోహ్లీ వివరించాడు. పుల్వామా దాడిపై సంజీవ్ గోయెంకా, విరాట్ కోహ్లీ తీవ్రంగా కలత చెందారు. అమరవీరుల కుటుంబాలకు వీరిద్దరూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముంబైలో ఈనెల 16న జరగాల్సిన ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్(ఐఎస్‌హెచ్) కార్యక్రమాన్ని ఆదివారానికి మార్చినట్లు ఐఎస్‌హెచ్ ట్విటర్‌లో పేర్కొంది.

2609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles