లార్డ్స్ ఓటమి తర్వాత కోహ్లి భావోద్వేగ సందేశం

Tue,August 14, 2018 12:19 PM

Virat Kohli posted an emotional message after Lords test loss

లండన్: ఎప్పటిలాగే ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా కిందా మీదా పడుతున్నది. రెండు టెస్టుల్లోనూ దారుణమైన పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా లార్డ్స్ టెస్ట్‌లో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కోహ్లిని కూడా వదలకుండా అభిమానులు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. అటు బీసీసీఐ కూడా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కోహ్లి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు. కొన్నిసార్లు మనం గెలుస్తాం.. కొన్నిసార్లు పాఠాలు నేర్చుకుంటాం. మీరు మాపై ఎప్పుడూ నమ్మకం కోల్పోకండి.. మేము కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయం అని కోహ్లి తన సందేశంలో స్పష్టంచేశాడు.

వచ్చే శనివారం నుంచి ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడితే సిరీస్ కోల్పోతుంది. అదే జరిగితే కెప్టెన్ కోహ్లితోపాటు కోచ్ రవిశాస్త్రిపై కూడా కఠిన చర్యలకు బీసీసీఐ సిద్ధమవుతున్నది. మరోవైపు కోహ్లి వెన్నుగాయంతో బాధపడుతుండటంతో మూడోటెస్ట్‌కు ఆడటం అనుమానంగా మారింది. ఒకవేళ కోహ్లి మిస్ అయితే అతని స్థానంలో అశ్విన్ కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉంది.

3502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles