ఇంగ్లండ్ విక్ట‌రీని అడ్డుకున్న కోహ్లీ

Sun,November 13, 2016 04:47 PM

Virat Kohli plays crucial game to stop England from victory

రాజ్‌కోట్ : ఇంగ్లండ్ విక్ట‌రీని విరాట్ కోహ్లీ అడ్డుకున్నాడు. తొలి టెస్ట్ అయిదవ రోజు చివ‌రి సెష‌న్‌లో ఇంగ్లండ్ స్పిన్న‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్న కెప్టెన్ కోహ్లీ ఒక ర‌కంగా జ‌ట్టును ఓట‌మి నుంచి త‌ప్పించాడు. 310 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ చివ‌రి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆరు వికెట్లు కోల్పోయి 172 ర‌న్స్ చేసింది. ఓ ద‌శ‌లో ఇంగ్లండ్ విక్ట‌రీ వైపు దూసుకెళ్ల‌తున్న‌ట్ల అనిపించినా, వాళ్ల ఆశ‌ల‌కు కోహ్లీ అడ్డుక‌ట్ట వేశాడు. దీంతో రాజ్‌కోట్‌లో జ‌రిగిన తొలి టెస్ట్ డ్రాగా ముసిగింది. కోహ్లీ 49, జ‌డేజా 32 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును మొయిన్ అలీ గెలుచుకున్నాడు.
స్కోరు బోర్డు
ఇంగ్లండ్ 537, 260-3 డిక్లేర్డ్‌
ఇండియా 488, 172-6

2598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles