కోహ్లికి ధోనీ కెప్టెన్సీ పాఠాలు

Thu,February 2, 2017 01:32 PM

Virat Kohli learning how to lead a team in shorter format from MS Dhoni

బెంగ‌ళూరు: టెస్టుల్లో ఇప్ప‌టికే స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లి. కానీ వ‌న్డేలు, టీ20ల్లో అత‌నికి కెప్టెన్సీ అనుభం లేదు. దీంతో సీనియ‌ర్ మెంబ‌ర్‌, మిస్ట‌ర్ కూల్ ధోనీపై అత‌డు ఆధార‌ప‌డుతున్నాడు. అప్ప‌టిక‌ప్పుడు వేగంగా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన ఈ ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ త‌న‌కు నిజంగా స‌వాలేన‌ని అంటున్న విరాట్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు ధోనీ స‌ల‌హాలు తీసుకుంటున్నాన‌ని చెప్పాడు. మ‌రీ ముఖ్యంగా కీల‌కమైన స‌మ‌యాల్లో పూర్తిగా ధోనీపైనే ఆధార‌ప‌డుతున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సంద‌ర్భంగా రెండు మ్యాచుల్లోనూ ధోనీ స‌ల‌హాలు పాటించ‌డం వ‌ల్లే విజ‌యాలు సాధించ‌గ‌లిగామ‌ని విరాట్ చెప్పాడు. మూడో టీ20లో చాహ‌ల్ కోటా పూర్త‌వ‌గానే తాను పాండ్యాకు బౌలింగ్ ఇవ్వాల‌నుకున్నా.. ధోనీ, నెహ్రా మాత్రం బుమ్రాను తీసుకురావాల‌ని చెప్పార‌ని విరాట్ వెల్ల‌డించాడు.

ధోనీ చెప్పిన‌ట్లే బుమ్రాకు బౌలింగ్ ఇవ్వ‌డంతో అత‌ను మూడు బంతుల్లోనే రెండు వికెట్లు తీసి మ్యాచ్ ముగించాడు. 19వ ఓవ‌ర్ వ‌ర‌కూ వేచి చూడ‌కుండా స్టార్ బౌల‌ర్‌ను ఇప్పుడే దించాల‌న్న‌ది ధోనీ.. కోహ్లికి ఇచ్చిన స‌ల‌హా. అది బాగానే ప‌నిచేసింది. కెప్టెన్సీకి తాను కొత్త కాక‌పోయినా.. షార్ట్ ఫార్మాట్‌లో అవ‌స‌ర‌మైన నైపుణ్యం ధోనీ ద‌గ్గ‌ర ఉంద‌ని, ఈ విష‌యంలో అత‌ను త‌న‌కు ఎంత‌గానో సాయ‌ప‌డుతున్నాడ‌ని కోహ్లి చెప్పాడు. మంచి టీమ్‌పై మూడు సిరీస్‌ల‌నూ గెల‌వ‌డం అద్భుతంగా అనిపిస్తోంది. అంత‌గా అనుభ‌వం లేని టీమ్స్‌తోనే ఈ ఘ‌న‌త సాధించాం. యువ ఆట‌గాళ్ల‌తో టీమిండియా దూసుకెళ్తోంది అని విరాట్ అన్నాడు.

3227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles