డీజే బ్రావోతో స్టెప్పులేసిన..కోహ్లీ,రాహుల్,భజ్జీ: వీడియో

Tue,April 17, 2018 03:40 PM


న్యూఢిల్లీ: కరీబియన్ క్రికెటర్లు ఎక్కడుంటే అక్కడా సరదా సన్నివేశాలు, డ్యాన్స్‌లు ఉండాల్సిందే. అంతర్జాతీయంగా పేరొందిన పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తారు. వికెట్ తీసినా, క్యాచ్ పట్టినా.. మ్యాచ్ గెలిచినా విండీస్ క్రికెటర్లు పిడికిళ్లని బిగించి మోచేతుల్ని ముందుకీ వెనక్కీ కదిలిస్తూ ఛాంపియన్ అంటూ స్టెప్పులేసేసిన దృశ్యాన్ని చాలాసార్లు మైదానంలో చూశాం. తాజగా బ్రావో సారథ్యంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


తాజాగా ఐపీఎల్‌లో ఆడుతున్న కొంతమంది క్రికెటర్లు ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పాటలు పాడుతూ స్టేజ్‌పై డ్యాన్స్ చేశాడు. అతనితో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్, చెన్నై సీనియర్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ కలిసి గ్రూప్ డ్యాన్స్ చేశారు. ఈ ఈవెంట్‌లో విరాట్ కోహ్లీనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గతంలో బాలీవుడ్ పాటలకు చాలాసార్లు అతడు స్టెప్పులేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పెళ్లయిన తరువాత తన భార్య అనుష్కశర్మతోనూ కాలు కదిపిన విషయం తెలిసిందే.
2814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles