కోహ్లి అంత చెత్త రీవ్యూవర్ ఎవరూ లేరు!

Mon,September 10, 2018 01:47 PM

Virat Kohli is the worst reviewer in the world says England former cricketer Micheal Vaughn

లండన్: డెసిషన్ రీవ్యూ సిస్టమ్ (డీఆరెస్) వచ్చిన తర్వాత చాలా మంది దానిని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం దక్కడంతో చాలాసార్లు బ్యాట్స్‌మెన్ తప్పించుకోవడమో, బౌలర్ వికెట్ దక్కించుకోవడమే జరుగుతున్నది. ఈ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎక్స్‌పర్ట్ అయిపోయాడు. ధోనీ రీవ్యూ అడిగాడంటే అది కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న పేరు అతను సంపాదించాడు. ప్రస్తుత కెప్టెన్ కోహ్లి మాత్రం డీఆరెస్ విషయంలో దారుణంగా విఫలమవుతున్నాడు. విరాట్ రీవ్యూ కోరిన చాలా వాటిల్లో ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఇలాగే రెండు రీవ్యూలను వృథా చేశాడు. 12 ఓవర్ల వ్యవధిలోనే రెండు రీవ్యూలను ఇండియా కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ కోహ్లికి ప్రపంచంలోనే చెత్త రీవ్యూవర్ అంటూ ఓ పేరు పెట్టేశాడు.రెండో ఇన్నింగ్స్ పదో ఓవర్లో జడేజా వేసిన బాల్ ఇంగ్లండ్ ఓపెనర్ జెన్నింగ్స్ ప్యాడ్లను తగిలింది. దీంతో ఫీల్డర్లంతా అప్పీల్ చేసినా అంపైర్ ఔటివ్వలేదు. వెంటనే కోహ్లి రీవ్యూ కోరాడు. అయితే ఇంపాక్ట్ ఔట్‌సైడ్ ఉండటంతో థర్డ్ అంపైర్ కూడా నాటౌట్ అని ప్రకటించేశాడు. ఒక రీవ్యూని టీమ్ కోల్పోయింది. ఇక 12వ ఓవర్లో మళ్లీ జడేజా బౌలింగ్‌లోనే అలిస్టర్ కుక్ ప్యాడ్స్‌కు బాల్ తగిలింది. అంపైర్ ఔటివ్వకపోవడంతో కోహ్లి మళ్లీ రీవ్యూ అడిగాడు. ఈసారి కూడా ఇంపాక్ట్ ఔట్‌సైడ్ అనే రావడంతో బ్యాట్స్‌మన్ బతికిపోయాడు. ఇండియా రీవ్యూ కోల్పోయింది.

5000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles