విరాట్‌ను చూసి నేర్చుకోమని నా తమ్ముడికి చెప్పా

Tue,April 17, 2018 07:32 PM

Virat Kohli is the Cristiano Ronaldo of Cricket, Says Dwayne Bravoబెంగళూరు:టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రావో తాజాగా విరాట్ కోహ్లీని తన మాటలతో ఆకాశానికెత్తేశాడు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోతో విరాట్‌ను పోల్చాడు. విరాట్ కోహ్లీ ..క్రికెట్‌కి రొనాల్డో అని అభివర్ణించాడు.

ఈ సందర్భంగా బ్రావో ఏమన్నాడంటే.. ఫుట్‌బాల్‌లో రొనాల్డో ఎంత గొప్ప ఆటగాడో, క్రికెట్‌లో కూడా విరాట్ కోహ్లీ అంత గొప్ప ఆటగాడు. నేను ఇక్కడ ఉన్నానని ఇలా మాట్లాడట్లేదు. నా తమ్ముడు డారెన్‌తో విరాట్ అండర్-19 క్రికెట్ ఆడాడు. విరాట్‌ను చూసి నేర్చుకొవాలని నా తమ్ముడికి ఎప్పటికీ చెబుతుంటా. నిజానికి ఒకసారి నా తమ్ముడికి బ్యాటింగ్‌తో పాటు క్రికెట్‌కు సంబంధించిన సలహాలివ్వమని కోహ్లీని అడిగాను. క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డ్‌ని కోహ్లీ రూపంలో చూసినట్లుంటుంది. టీమిండియా తరఫున, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీ ఆడే ప్రతి మ్యాచ్‌ను నేను ఆస్వాదిస్తా. ఆటపై అతనికున్న అభిరుచి అమోఘం. విరాట్ ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యమవుతోంది. క్రికెట్‌లో ఎన్ని రికార్డులు ఉన్నాయో.. వాటిని అందుకునే అన్ని అర్హతలు కోహ్లీకి ఉన్నాయని బ్రావో పేర్కొన్నాడు.

4600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles