కోహ్లీని ఊరిస్తున్న రికార్డు

Sun,July 22, 2018 07:51 AM

Virat Kohli has to chase a record

లండన్: స్వదేశం, విదేశమన్న తేడా లేకుండా టెస్ట్‌ల్లో అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తున్నది. వచ్చే నెల 1న ఇంగ్లండ్‌తో మొదలయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో విజయం సాధిస్తే దిగ్గజాలు అజిత్ వాడేకర్, కపిల్‌దేవ్, రాహుల్ ద్రవిడ్ సరసన కోహ్లీ చోటు దక్కించుకుంటాడు. సౌరవ్ గంగూలీ, ధోనీకి సాధ్యం కాని అరుదైన రికార్డును విరాట్ అందుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నోసార్లు ఇంగ్లండ్‌లో పర్యటించి విఫలమైన భారత జట్టు 1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలో తొలిసారి సిరీస్ విజయాన్నందుకుంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 1-0తో గెలిచింది. ఆ తర్వాత హర్యానా హారికేన్ కపిల్‌దేవ్ కెప్టెన్సీలో భారత్ 1986లో ఇంగ్లండ్ జట్టుపై సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు టెస్ట్‌ల్లో రెండింటిని దక్కించుకుంది. ఆఖరిసారిగా రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్‌ఇండియా 2007లో ఇంగ్లండ్‌ను ఓడించింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయం వాడేకర్, కపిల్‌దేవ్, ద్రవిడ్‌కు సాధ్యపడగా, గంగూలీ, ధోనీకి నిరాశే ఎదురైంది. 2002లో దాదా కెప్టెన్సీలోని భారత్ నాలుగు టెస్ట్‌లను 1-1తో డ్రా చేసుకోగా, 2014లో ఐదు టెస్ట్‌లను ధోనీసేన 1-3తో కోల్పోయింది.

3966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles