విరాట్ కోహ్లీ‌కి భారీ జ‌రిమానా!

Sun,April 14, 2019 06:46 PM

Virat Kohli Fined Rs 12 Lakh For Slow Over-Rate In KXIP vs RCB IPL 2019 Clash

మొహాలి వేదికగా శనివారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. ఐతే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ‌కి భారీ జరిమానా ప‌డింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా కోహ్లీకి రూ. 12 లక్షలు జరిమానా విధించారు. `స్లో ఓవ‌ర్‌రేట్ కార‌ణంగా ఆర్సీబీ జ‌ట్టు కెప్టెన్ కోహ్లీకి 12 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధిస్తున్నాం. ఇలా చేయ‌డం ప‌న్నెండో సీజన్‌లో ఈ జ‌ట్టుకు ఇదే తొలిసారి` అని ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఓ లేఖ విడుద‌ల చేసింది. కాగా, ఈ ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన బెంగ‌ళూరు జ‌ట్టు కేవ‌లం ఒక్క‌ మ్యాచ్‌ల్లో మాత్రమే విజ‌యం సాధించి పాయింట్ల పట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచింది.

ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇప్పటి నుంచి అన్నీ మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో జూలు విదిల్చింది. చేజింగ్ కింగ్ కోహ్లీతో పాటు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ విజృంభించడంతో ఆరు పరాజయాల తర్వాత ఆర్సీబీ గెలుపు ముఖంచూసింది.

5651
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles