కోహ్లి కోరుకున్నోడే కోచ్‌!

Tue,July 11, 2017 05:31 PM

Virat Kohli finally gets what he wanted

ముంబై: ఎన్న‌డూ లేనంతగా ఈసారి టీమిండియా కోచ్ ఎవ‌రు అన్న‌దానిపై విప‌రీత‌మైన చ‌ర్చ న‌డిచింది. దానికి కార‌ణం మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లి మ‌ధ్య విభేదాలు. గ‌తేడాది ర‌విశాస్త్రిని వెన‌క్కి నెట్టి కోచ్ అయిన కుంబ్లేతో కెప్టెన్ విరాట్ కు అస్స‌లు ప‌డ‌లేదు. కుంబ్లే కోచింగ్ స్టైల్ అత‌నితోపాటు టీమ్‌లోని కొంద‌రు సీనియ‌ర్స్‌కూ న‌చ్చ‌లేదు. దీంతో బ‌ల‌వంతంగానైనా కుంబ్లేనే కోచ్‌గా కొన‌సాగించాల‌నుకున్న సీఏసీ, బీసీసీఐ ఎత్తుగ‌డ‌లు ఫ‌లించ‌లేదు. కుంబ్లే రాజీనామా చేశాడు. అక్క‌డి నుంచి అస‌లు క‌థ మొద‌లైంది. కోచ్ ఎంపిక ప్ర‌క్రియ శాస్త్రీయంగా కాకుండా కేవ‌లం శాస్త్రి కోస‌మే నడిచిన‌ట్లుగా సాగింది. అంత‌వ‌ర‌కు క‌నీసం ద‌ర‌ఖాస్తు కూడా చేసుకోని ర‌విశాస్త్రి ద‌గ్గ‌రికి బీసీసీఐయే వెళ్లి బ‌తిమాల‌డం.. అత‌ను ష‌ర‌తులు విధించ‌డం అసాధార‌ణ ప‌రిణామ‌మే.

గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి కోచ్ ఎంపిక‌లో కెప్టెన్ పాత్ర స్ప‌ష్టంగా క‌నిపించింది. కుంబ్లే రాజీనామా నుంచి ర‌విశాస్త్రిని కోచ్‌గా నియ‌మించే వ‌ర‌కు కోహ్లి కోరుకున్న‌ట్లే జ‌రిగింది. నిజానికి చాంపియ‌న్స్ ట్రోఫీకి వెళ్లే ముందే ర‌విని కోచ్‌ను చేస్తే బాగుంటుంద‌ని సీఏసీకి కోహ్లి సూచించాడు. కానీ కొత్త కోచ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ నోటిఫికేష‌న్ జారీ చేసినా.. ర‌వి అప్లై చేసుకోలేదు. దీంతో కుంబ్లే రాజీనామాను అడ్డం పెట్టుకొని మ‌రోసారి గ‌డువు పెంచి అత‌న్ని బ‌రిలో నిలిచేలా చేసింది బీసీసీఐ. అయినా సీఏసీ హెడ్‌గా గంగూలీ ఉండ‌టంతో ర‌విశాస్త్రి కోచ్ అవ‌డం అంత సులువు కాద‌ని కూడా చాలా మంది భావించారు.

నిజానికి గ‌తేడాది ర‌విని కాద‌ని కుంబ్లేను తీసుకొచ్చిన గంగూలీ.. ఈసారి కూడా చివ‌రిదాకా అదే ప్ర‌య‌త్నం చేశాడు. అందుకే అనూహ్యంగా త‌ర్వాతి కోచ్ సెహ్వాగ్ అన్న ప్ర‌చారం కూడా సాగింది. ఇంట‌ర్వ్యూలో మిగ‌తావారి కంటే సెహ్వాగ్ ఇచ్చిన ప్ర‌జెంటేష‌న్ సీఏసీకి బాగా న‌చ్చింద‌న్న వార్త‌లూ వ‌చ్చాయి. దీంతో ఈసారీ గంగూలీ కోరుకున్న‌దే జ‌రుగుతున్న‌ద‌ని అంతా అనుకున్నారు. అంతేకాదు కోచ్ ఎంపిక‌పై కెప్టెన్‌తో మాట్లాడాలి అని గంగూలీ అన్న‌పుడు కూడా ర‌విశాస్త్రిని ప‌క్క‌న పెట్టేశార‌న్న సందేహాలు క‌లిగాయి. కానీ ఈసారి మాత్రం దాదా వ్యూహాలు ఫ‌లించ‌లేదు. కోచ్‌తో 24 గంట‌లూ ప‌నిచేయాల్సింది కెప్టెనే అని, దీంతో అత‌ని అభీష్టానికి వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మంచి కాద‌న్న సీఓఏ సూచ‌న కూడా సీఏసీని ర‌విశాస్త్రివైపు మొగ్గేలా చేసింది. ఎన్ని ట్విస్టులు జ‌రిగినా.. చివ‌రికి విరాటే గెలిచాడు.

2037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles