మాంచెస్ట‌ర్‌లో విరుష్కా చ‌క్క‌ర్లు

Tue,July 9, 2019 11:56 AM

Virat Kohli enjoys with Anushka Sharma at Manchester

హైద‌రాబాద్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సెమీస్ మ్యాచ్‌కు ముందు భార్య అనుష్కా శ‌ర్మ‌తో మాంచెస్ట‌ర్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టాడు. శ‌నివారం శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విక్ట‌రీ కొట్టిన త‌ర్వాత కెప్టెన్ కోహ్లీ ఓ రోజును త‌న భార్య‌కు అంకితం ఇచ్చాడు. కోహ్లీ, అనుష్కాల‌ను ముద్దుగా విరుష్కా అని పిలిచే విష‌యం తెలిసిందే. అయితే ఈ జంట‌.. సెమీస్‌కు ముందు మాంచెస్ట‌ర్ వీధుల్లో సంద‌డి చేసింది. సైడ్ సీయింగ్‌కు వెళ్లిన ఈ జంట త‌మ అభిమానుల‌ను థ్రిల్ చేసింది. కొంద‌రు ఫ్యాన్స్ ఈ ఇద్ద‌రితో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్ స‌మ‌యంలోనూ అనుష్కా స్టేడియం స్టాండ్స్ నుంచి టీమిండియాకు చీర్స్ చెప్పింది. ఇప్పుడు ఫ్యాన్స్‌తో దిగిన సెల్ఫీలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. విరాట్ గ్రే టీష‌ర్ట్‌లో.. అనుష్కా బ్లాక్ అవుట్‌ఫిట్‌, వైట్ స్నీక‌ర్‌లో మాంచెస్ట‌ర్ వీధుల్లో క‌నువిందు చేశారు.


View this post on Instagram

Good Morning 😍

A post shared by Anushka Sharma FC ❥ (@anushkafcs) on

2795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles