ఆ ట్వీట్‌ను డిలిట్ చేసిన విరాట్‌

Thu,June 22, 2017 06:38 PM

Virat Kohli Deletes Tweet Welcoming Anil Kumble As Team India Coach

బార్బ‌డోస్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి మ‌రో పిచ్చి ప‌ని చేశాడు. 2016లో కుంబ్లేను కోచ్‌గా నియ‌మించిన స‌మ‌యంలో తాను అత‌న్ని స్వాగ‌తిస్తూ పెట్టిన ట్వీట్‌ను అత‌ను తొల‌గించాడు. కుంబ్లే త‌మ‌తో క‌ఠినంగా ఉంటున్నాడంటూ అత‌ని ప‌ద‌వి ఊడేలా చేసిన విరాట్.. ఇప్ప‌టికే అభిమానుల విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఈ ట్వీట్ డిలిట్ చేసి త‌న ప‌రిణ‌తి లేని మ‌న‌స్త‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు. గ‌తేడాది జూన్ 23న విరాట్ ఈ ట్వీట్ చేశాడు. ఇప్పుడ‌ది క‌నిపించ‌డం లేదంటూ ఓ వ్య‌క్తి దాని స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. ఇది చాలా సిల్లీగా ఉందంటూ అత‌ను కామెంట్ చేశాడు.


విరాట్ తాను చేసిన ట్వీట్‌ను తొల‌గించినా.. అత‌నికి థ్యాంక్స్ చెబుతూ అప్ప‌ట్లో కుంబ్లే చేసిన ట్వీట్ మాత్రం అలాగే ఉంది.

2835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles