అఫ్రిది వ్యాఖ్యలను తప్పుబట్టిన కోహ్లి

Wed,April 4, 2018 05:17 PM

Virat Kohli condemns Shahid Afridis comments on Kashmir

బెంగళూరు: కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి విమర్శల పాలైన పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా మండిపడ్డాడు. తన జాతి ప్రయోజనాలను వ్యతిరేకించే ఎవరి అభిప్రాయాలకూ తన మద్దతు ఉండదని కోహ్లి స్పష్టంచేశాడు. ఓ భారతీయుడిగా దేశానికి ఏది మంచిదో అదే చేస్తాం. కొన్ని అంశాలపై స్పందించాలా వద్దా అన్నది వాళ్ల వ్యక్తిగత విషయం. ఓ అంశంపై పూర్తి అవగాహన లేకుండా నేను మాట్లాడను. కానీ నా వరకు దేశ ప్రయోజనాలే ముందుంటాయి అని కోహ్లి తేల్చి చెప్పాడు.


కశ్మీర్‌లో స్వీయ నిర్ణయాధికారం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న అమాయకులను అణచివేస్తున్నారంటూ పాక్ క్రికెటర్ అఫ్రిది ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో యూఎన్ (ఐక్యరాజ్యసమితి) జోక్యం చేసుకోవాలని కూడా డిమాండ్ చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా క్రికెటర్ గంభీర్ కూడా అఫ్రిదికి అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. బుద్ధి మాంద్యం ఉన్న అఫ్రిది దృష్టిలో యూఎన్ అంటే అండర్ 19 అని, అతని వ్యాఖ్యలను మీడియా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని గంభీర్ ట్వీట్ చేశాడు.

2968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles