కోహ్లీ, పుజారా ర్యాంకులు పదిలం

Wed,April 4, 2018 04:29 PM

Virat Kohli, Cheteshwar Pujara remain steady in ICC Test rankingsదుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్టు ప్లేయర్ ర్యాంకులను తాజాగా విడుదల చేసింది. విరాట్ కోహ్లీ రెండు, పుజారా ఏడు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. వీరిద్దరు మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకొని చాలా రోజుల నుంచి తమ ర్యాంకులను పదిలం చేసుకుంటూ వస్తున్నారు.

29ఏళ్ల కోహ్లీ 912 పాయింట్లు, పుజారా 810 పాయింట్లతో టాప్-10లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 929 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ కన్నా విరాట్ కేవలం 17 పాయింట్లు మాత్రమే వెనక ఉన్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత టెస్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం దిగజారాడు. 803 పాయింట్లతో అతడు ఐదో స్థానానికి చేరాడు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 844 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో 390 రేటింగ్స్‌తో జడేజా రెండు, 367 పాయింట్లతో అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

1435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles