కోహ్లి నా రికార్డునూ వదలడు!Thu,December 7, 2017 03:16 PM

కోహ్లి నా రికార్డునూ వదలడు!

న్యూఢిల్లీ: ఆ రికార్డు ఈ రికార్డు అన్న తేడా లేకుండా క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాస్తూ వెళ్తున్నాడు విరాట్ కోహ్లి. సచిన్, లారా, బ్రాడ్‌మన్ రికార్డులను అతను బద్దలు కొట్టాడు. ఈ లెక్కన తన రికార్డును కూడా కోహ్లి ఈజీగా బీట్ చేస్తాడని అంటున్నాడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర. ఇంతకీ ఆ రికార్డు ఏంటో తెలుసా? ఒక కేలండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్‌లలో కలిపి సంగక్కర.. 2868 పరుగులు చేశాడు. ఇదే అత్యధికం. కోహ్లి 2017లో 2818 పరుగులు చేశాడు. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు అతనికి రెస్ట్ ఇవ్వడంతో ఇక ఈ ఏడాది సంగక్కర రికార్డును బీట్ చేసే చాన్స్ కోహ్లికి లేదు. అయితే ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది, ఆ మరుసటి ఏడాది అయినా విరాట్ తన రికార్డును తిరగరాస్తాడని సంగక్కర అన్నాడు. కోహ్లి బ్యాటింగ్ చూస్తుంటే.. నా రికార్డు ఎక్కువ రోజులేమీ ఉండదు అని అతను ట్వీట్ చేశాడు.


రెండేళ్లుగా విపరీతమైన క్రికెట్ ఆడుతున్నానని, తనకు విశ్రాంతి అవసరం అని కోహ్లి చెప్పడంతో అతన్ని శ్రీలంక వన్డే, టీ20 సిరీస్‌లకు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల కఠినమైన సౌతాఫ్రికా టూర్‌కు ముందు అవసరమైన విశ్రాంతి అతనికి దక్కుతుంది.

5398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS