కోహ్లీ డేటింగ్ వ్యాఖ్యలపై ట్రోలింగ్‌..: వైర‌ల్ వీడియో

Wed,January 16, 2019 08:09 AM

Virat Kohli calls girl ugly in throwback video, gets brutally trolled

న్యూఢిల్లీ: ఓ టీవీ షోలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లను బీసీసీఐ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తోంది. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ 19ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అనుషా దండేకర్.. అతడి తొలి డేటింగ్ అనుభవంపై ప్రశ్నించింది.

తాను మొదటిసారి డేటింగ్ కోసం వెళ్లిన అమ్మాయి అంద విహీనంగా ఉండటంతో అక్కడి నుంచి వెంటనే పారిపోయానని విరాట్ బదులిచ్చాడు. 11ఏళ్లనాటి ఇంటర్వ్యూ వీడియోను ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఎమ్మెస్ డెన్నిస్ తాజాగా ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పరిణతిలేని వయస్సులో కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
6117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles