కోహ్లీని ఆశీర్వ‌దించిన డేరా చీఫ్‌ - వీడియో

Fri,August 25, 2017 02:53 PM

Virat Kohli, Ashish Nehra took Gurmeet Ram Rahim Singhs blessings

న్యూఢిల్లీ: డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ ఇప్పుడో సెన్షేష‌న్‌. ఈ గురుజీ ఓ రేప్ కేసులో ప్ర‌స్తుతం కోర్టు ముందు ఉన్నాడు. కానీ ఒక‌ప్పుడు రామ్ ర‌హీమ్ చూపిన మార్గంలోనే ప్ర‌స్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ న‌డిచాడ‌ట‌. కోహ్లీ స‌క్సెస్‌లో డేరా చీఫ్ ప్రాత చాలా ఉంద‌ట‌. గ‌తంలో భార‌త క్రికెట‌ర్లు ఆధ్మాత్మిక గురువు రామ్ ర‌హీమ్ వ‌ద్ద ఆశీస్సులు తీసుకున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది. విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రా, విజ‌య్ ద‌హియాలు ఒక‌ప్పుడు గుర్మీత్ ద‌గ్గ‌ర ఆశీస్సులు పొందారు. ఆ ఆశీస్సుల వ‌ల్లే వాళ్లు క్రికెట్‌లో రాణించిన‌ట్లు గుర్మీత్ చెప్పుకొచ్చారు. క్రికెట‌ర్లే కాదు బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ కూడా డేరా చీఫ్ బోధ‌న‌లు వినే మేటి బాక్స‌ర్ అయ్యాడ‌ట‌. గ‌తంలో ఓ సారి గుర్మీత్ ద‌గ్గ‌ర ఆశీస్సులు పొందిన క్రికెట‌ర్ల వీడియో ఇదే.


2246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles