నాటింగ్‌హమ్ వీధుల్లో కోహ్లీ, అనుష్క: వీడియో వైరల్

Wed,July 11, 2018 08:43 PM

Virat Kohli, Anushkha Sharma hang out with friends in Nottingham

నాటింగ్‌హమ్: ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌ను విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ 2-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్ వచ్చే గురువారం నుంచి నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఆరంభంకానుంది. టీ20 సిరీస్ అనంతరం విరామం దొరకడంతో భారత ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంత మంది సరదాగా స్థానిక రెస్టారెంట్లు, షాపింగ్స్ వెళ్తున్నారు. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి నాటింగ్‌హమ్ వీధుల్లో విహరిస్తున్నాడు. ఐర్లాండ్‌తో సిరీస్ ముగిసిన తరువాత ఇంగ్లాండ్‌కు చేరుకున్న టీమిండియాతో అనుష్క కలిసిన విషయం తెలిసిందే. విరుష్క జోడీతో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడి వీధుల్లో తిరుగుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.3027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS