భారత హైకమిషన్‌ను సందర్శించిన కోహ్లీసేన‌

Wed,August 8, 2018 01:02 PM

Virat Kohli Anushka Sharma visit High Commission of India in London with team

లండన్: లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని టీమ్ ఇండియా క్రికెటర్లు సందర్శించారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు భారత హైకమిషన్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించింది. ఈ కార్యక్రమానికి టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, కోచింగ్ సిబ్బంది, క్రికెటర్లు పాల్గొన్నారు. వీరితోపాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా వెళ్లింది. అనంతరం కార్యాలయ భారత హైకమిషనర్, సిబ్బందితో ఫొటోలు దిగారు. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో గురువారం లార్డ్స్ వేదికగా ఆరంభంకానున్న రెండో టెస్టులో కోహ్లీసేన తలపడనుంది.

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు ముగిసేవరకు జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్లు వారి భాగస్వాములు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండాలని ఇటీవల బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు ఆటగాళ్లతో కొనసాగేందుకు వీల్లేదని బోర్డు చెప్పినప్పటికీ టీమ్‌తో పాటు అనుష్క వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 45రోజుల పర్యటనలో భాగంగా టూర్‌లో తొలి 14 రోజులు ముగిసిన తరువాతనే ఆయా ఆటగాళ్లు వారి భాగస్వాములను క‌లిసేలా బీసీసీఐ నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేసే ప‌నిలో ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.. తొలి టెస్టులో పరాజయం చవిచూసిన కోహ్లీసేన రెండో టెస్టులో గట్టిగా పుంజుకోవాలని ఆశిస్తోంది.

1195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS