34 కోట్లు.. 35వ అంతస్తు.. కోహ్లి కొత్త కాపురం ఇక్కడే!

Wed,December 13, 2017 01:25 PM

Virat Kohli and Anushka Sharma will be staying in this luxury apartment in Mumbai

ముంబైః విరుష్క పెళ్లయిపోయింది. ఇక ఇప్పుడు వాళ్లు హనీమూన్‌కు ఎక్కడికెళ్తున్నారు? ఎక్కడ కాపురం పెట్టబోతున్నారు?లాంటి వార్తల పరంపర మొదలైంది. ముంబైలోని ఖరీదైన వర్లీ ఏరియాలో గతేడాది కోహ్లి కొన్న ఫ్లాట్‌లోనే విరుష్క కొత్త కాపురం పెట్టబోతున్నారు. 2016లోనే విరాట్ ఈ ఫ్లాట్‌ను బుక్ చేసుకున్నా.. ఇంకా ఇంటీరియర్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓంకార్ 1973 ప్రాజెక్ట్స్‌లోని 35వ అంతస్తులో కోహ్లి ఈ ఫ్లాట్ కొన్నాడు. 7171 చదరపు అడుగుల్లో ఈ లగ్జరీ ఫ్లాట్ ధర రూ.34 కోట్లు కావడం విశేషం. ఐదు బెడ్‌రూమ్‌లు ఉన్న ఈ ఫ్లాట్‌లో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. బాంకెట్ హాల్, యోగా సెంటర్, లగ్జరీ స్పా, స్కై టెర్రస్, పూల్ డెక్.. ఇలా సామాన్యుడి ఊహకు కూడా అందని వసతులు ఈ ఖరీదైన ఫ్లాట్స్‌లో ఉండటం విశేషం. కోహ్లియే కాదు.. మరో క్రికెటర్ యువరాజ్ కూడా 2014లోనే ఇందులో ఓ ఫ్లాట్ కొన్నాడు. అతని ఫ్లాట్ 29వ అంతస్తులో ఉంది. ఈ నెల 11న ఇటలీలోని టస్కానీలో ఉన్న లగ్జరీ రిసార్ట్‌లో పెళ్లి చేసుకున్న కోహ్లి, అనుష్క జోడీ.. ఈ నెల 21, 26న రెండుసార్లు వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే.

4385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles