ప్రైవేట్ జెట్‌లో కోహ్లి, అనుష్క చెక్కర్లు

Tue,January 29, 2019 12:19 PM

Virat Kohli and Anushka Sharma travelling in a private plane

వెల్లింగ్టన్: ఫీల్డ్‌లోనూ, ఫీల్డ్ బయట టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్‌లలో చారిత్రక విజయాలు సాధించిన ఊపు మీదున్న విరాట్.. ఫీల్డ్ బయట భార్య అనుష్కతో కలిసి లాంగ్ హనీమూన్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏ టూర్‌కెళ్లినా ఆమెను వెంటబెట్టుకొని వెళ్తున్న కోహ్లి.. అక్కడి టూరిస్ట్ ప్లేసుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ సెలబ్రిటీ కపుల్ న్యూజిలాండ్ అందాలను ఆస్వాదిస్తున్నది. ఇప్పటికే ఆ టీమ్‌తో జరగిన మూడు వన్డేల్లోనూ గెలిచిన సిరీస్ సొంతం చేసుకోవడంతో కోహ్లి మంచి మూడ్‌లో ఉన్నాడు. దీంతో అనుష్కతో కలిసి ఓ ప్రైవేట్ జెట్‌లో చెక్కర్లు కొడుతున్నాడు. ఇద్దరూ ఓ ప్రైవేట్ ముందు కలిసి ఉన్న ఫొటోను కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. న్యూజిలాండ్ టూర్ అప్‌డేట్స్‌ను ఈ ఇద్దరూ ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరగబోయే మిగతా వన్డేలు, టీ20లకు విశ్రాంతినివ్వడంతో ఫుల్‌టైమ్ అనుష్కతో కలిసి తిరగడానికి విరాట్ ప్లాన్ వేసుకున్నాడు.

View this post on Instagram

Away we go ❤️😃#travelswithher

A post shared by Virat Kohli (@virat.kohli) on

2496
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles