కోహ్లి, అనుష్క వాలెంటైన్స్ డే మెసేజ్ చూశారా?

Thu,February 14, 2019 04:03 PM

Virat Kohli and Anushka Sharma post their Valentines Day message on Instagram

న్యూఢిల్లీ: సెలబ్రిటీ ప్రేమ జంటల్లో ఏడాది కిందట పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంట కూడా ఒకటి. 2017, డిసెంబర్‌లో ఇటలీలో పెళ్లితో ఒక్కటయ్యారు. అప్పటి నుంచీ ఎడతెగని హనీమూన్స్‌కి వెళ్తూనే ఉన్నారు. క్రికెట్ టూర్లలో భాగంగా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న విరాట్.. వెంట అనుష్కను కూడా తీసుకెళ్తున్నాడు. ఎక్కడికెళ్లినా అక్కడి రొమాంటిక్ ప్రదేశాల్లో ఈ ప్రేమ జంట తెగ తిరుగుతున్నది. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సెలబ్రిటీ కపుల్ తమ సోషల్ మీడియా అకౌంట్లో ఓ ప్రేమ సందేశాన్ని అభిమానులకు ఇచ్చారు. ఒక రోజు ముందుగానే డిన్నర్ డేట్‌కు వెళ్లిన సందర్భంగా దిగిన ఫొటోను విరాట్ పోస్ట్ చేశాడు. నా వాలైంటైన్‌తో డిన్నర్ డేట్ సందర్భంగా ఇలా అంటూ కోహ్లి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.అటు అనుష్క కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ గురించి ఓ గొప్ప సందేశాన్ని ఇస్తూ కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ మధ్యే న్యూజిలాండ్ టూర్ సందర్భంగా అక్కడి అందాలను విరుష్క ఆస్వాదించారు. అప్పటి ఫొటోలనే అనుష్క షేర్ చేసింది.

3367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles