జడేజా సెలెబ్రేషన్స్‌లో విరాట్ విహారం..

Sun,October 20, 2019 05:57 PM

రాంచీ: దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అర్ధసెంచరీ చేసిన విషయం తెలిసిందే. జడేజా ఏదైనా ల్యాండ్ మార్క్ చేరుకున్నప్పుడు బ్యాట్‌ను తిప్పుతూ(కత్తి తిప్పినట్లు) సెలెబ్రేషన్ చేసుకుంటాడనే విషయం తెలిసిందే. కాగా, ఈసారి జడేజా సెలెబ్రేషన్స్‌లో కెప్టెన్ విరాట్ కూడా భాగమయ్యాడు. జడ్డూ హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగానే మైదానంలో బ్యాట్‌ను తిప్పుతూ.. తనదైన ైస్టెల్‌లో ఎంజాయ్ చేస్తుండగా.. అతనికి కెప్టెన్ కోహ్లి నుంచి వినూత్న రీతిలో మద్దతు లభించింది. మామూలుగా మిగితా ఆటగాళ్లు, అభిమానులు చప్పట్లతో అభినందిస్తారు. కానీ, కోహ్లి మాత్రం జడ్డూ బ్యాట్ తిప్పుతుంటే తను హార్స్ రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోహ్లి తన టీమ్ మేట్స్ ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే.. తానే ఆ ఫీట్ సాధించినట్లు ఖుషీ చేస్తాడన్న విషయం తెలిసిందే. కాగా, జడేజాకు ఇది టెస్టుల్లో 13వ హాఫ్ సెంచరీ.


కాగా, మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ రోహిత్ డబుల్ సెంచరీ, రహానే సెంచరీలతో సహా జడేజా కూడా రాణించడంతో 497-9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో జార్జ్ 4 వికెట్లు తీయగా, రబాడా 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. షమీ, ఉమేష్ చెరో వికెట్ తీశారు. వెలుతురు లేమి కారణంగా ఎంపైర్లు మ్యాచ్‌ను ముందుగానే నిలిపేశారు.


1723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles