ఎఫ్‌1 ఈవెంట్‌కు హాజ‌రు కానున్న మాల్యా

Thu,July 7, 2016 01:53 PM

Vijay Mallya to attend F1 event on friday

లండ‌న్‌: దేశంలోని బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌నామం పెట్టి లండ‌న్‌లో త‌ల‌దాచుకుంటున్న లిక‌ర్ బార‌న్ విజ‌య్ మాల్యా తొలిసారి ప‌బ్లిగ్గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఫార్ములావ‌న్ బ్రిటిష్ గ్రాండ్ ప్రి సంద‌ర్భంగా త‌న టీమ్ ఫోర్సిండియా త‌ర‌ఫున శుక్రవారం జరిగే ఓ ఈవెంట్‌కు హాజ‌రుకానున్నారు మాల్యా. ఈ సంద‌ర్భంగా మిగ‌తా టీమ్ ఓన‌ర్ల‌తో క‌లిసి ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడ‌నున్నారు. ఈ సీజ‌న్‌లో తొలిసారి మాల్యా త‌న ఫోర్సిండియా టీమ్‌ను క‌ల‌వ‌బోతున్నారు. పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయి దేశం విడిచి పారిపోయిన మాల్యా క‌ష్టాల్లో ఉన్నా.. ఆయ‌న టీమ్ మాత్రం ఈ సీజ‌న్‌లో బాగానే పర్ఫామ్ చేస్తోంది. ఫోర్సిండియా కార్ల త‌యారీ కంపెనీ.. బ్రిటిష్ గ్రాండ్ ప్రి స‌ర్క్యూట్‌కు కూత‌వేటు దూరంలోనే ఉండ‌టంతో ఈ గ్రాండ్ ప్రిని హోమ్ రేస్‌గా భావిస్తోంది.

1367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles