వైరల్ వీడియో.. ఇక మేమెందుకు.. మీరే ఆడుకోండి!Tue,January 16, 2018 03:06 PM

Video of Roger Federer playing a Mixed Doubles match gone viral

మెల్‌బోర్న్‌ః మెన్ విల్ బి మెన్.. ఈ వైరల్ వీడియో చూస్తే మీకు అదే అనిపిస్తుంది. టెన్నిస్‌లో మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లుంటాయన్న సంగతి తెలుసు కదా. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం తమ మహిళా టీమ్ మేట్స్‌ను మరచిపోయారు టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్, అతని ప్రత్యర్థి జాక్ సాక్. ఫెడెక్స్ సర్వీస్ చేయగానే ఆ ఇద్దరే ఆడటం మొదలుపెట్టారు. ఇది చూసి ఆ ఇద్దరు మహిళా ప్లేయర్స్ ఆశ్చర్యపోయారు. వాళ్లు కేవలం ప్రేక్షకులుగా మారిపోయారు. మొదట ఫెదరర్ పార్ట్‌నర్ బెలిండా బెన్సిచ్ కోర్టులోనే కూర్చున్నది. ఆ తర్వాత జాక్ సాక్ పార్ట్‌నర్ కొకొ వాండ్‌వెగె మెల్లగా కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమెను చూసి బెలిండా కూడా పక్కకెళ్లి కూర్చుంది. అయినా ఫెదరర్, జాక్ సాక్ మాత్రం ఇవేమీ పట్టనట్లు తమపాటికి తాము ఆడుతూ వెళ్లిపోయారు. సుమారు నిమిషం పాటు ఆ ర్యాలీ సాగింది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఇది చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు జరిగే హాప్‌మన్ కప్ ఫైనల్లో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేయగా గంటల్లోనే వైరల్‌గా మారిపోయింది.


3406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS