ప్లేయర్స్‌తో కలిసి డ్యాన్స్ చేసిన దేశాధ్యక్షురాలు.. వీడియో

Thu,July 12, 2018 01:55 PM

Video of Croatian president celebrates and dances with Football team gone viral

మాస్కో: ఫుట్‌బాల్ అభిమానులు ఎంత క్రేజీగా ఉంటారో మనకు తెలుసు. మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియానికి వింత వింత వేషధారణలతో వస్తుంటారు. మ్యాచ్ మొత్తం తెగ ఎంజాయ్ చేస్తుంటారు. తమ టీమ్ గెలిస్తే ఆకాశమే హద్దుగా సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో తమ టీమ్ క్రొయేషియా తొలిసారి ఫైనల్ చేరడంతో ఆ దేశాధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ కూడా ఓ సాధారణ అభిమానిలా సంబురాలు చేసుకున్నారు. ప్లేయర్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఒక్కొక్క ప్లేయర్ దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. మిగతా అభిమానులతో కలిసి ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి రష్యా చేరుకున్న ఆమె.. క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ నుంచి టీమ్‌తోపాటే ఉన్నారు. టీమ్ జెర్సీ కూడా వేసుకున్నారు. సడెన్‌గా ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి వాళ్లను ఆశ్చర్యపరిచారు. ఈ వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయారు. 2015, జనవరిలో ఆమె నాలుగోసారి క్రొయేషియా అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈమె 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.2456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles