కోచ్ ప‌ద‌వికి నేను అప్లై చేయ‌లేదు!

Fri,June 30, 2017 10:52 AM

Venkatesh Prasad denies applying for Team India head coach job

బెంగ‌ళూరు: టీమిండియా కోచ్ ప‌ద‌వికి తాను ద‌ర‌ఖాస్తు చేసుకున్నాన‌న్న వార్త‌ల‌ను మాజీ పేస్‌బౌల‌ర్ వెంక‌టేశ్ ప్ర‌సాద్ ఖండించాడు. అయితే అసిస్టెంట్ కోచ్ లేదా బౌలింగ్ కోచ్ కోసం తాను ఎదురుచూస్తున్న‌ట్లు అత‌ను చెప్పాడు. అసిస్టెంట్ కోచ్‌గా చేయాల‌ని ఉంది. క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ దీని గురించి ఆలోచిస్తుంద‌ని భావిస్తున్నా అని ప్ర‌సాద్ అన్నాడు. గురువారం కోచ్ ప‌ద‌వికి ప్ర‌సాద్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడ‌న్న వార్తలు వ‌చ్చాయి. అయితే దీనిపై వెంట‌నే క్లారిటీ ఇచ్చాడు ప్ర‌సాద్‌. త‌న‌కు బౌలింగ్ లేదా అసిస్టెంట్ కోచ్‌గా చేయాల‌ని ఉంద‌న్న విష‌యంపై అటు బోర్డుకుగానీ, ఇటు సీఏసీకిగానీ తాను లేఖ రాయ‌లేద‌ని కూడా అత‌ను స్ప‌ష్టంచేశాడు.

కోచ్‌గా సెహ్వాగ్ అవుతాడా లేక ర‌విశాస్త్రి అవుతాడా అన్న‌ది తెలియ‌దుగానీ.. వాళ్ల‌కు అసిస్టెంట్‌కు చేయ‌డానికి నేను సిద్ధం. గ‌తంలోనూ బౌలింగ్ కోచ్‌గా చేశాను. ప్లేయ‌ర్‌గా, కోచ్‌గా నా అనుభ‌వం టీమ్‌కు ప‌నికొస్తుంద‌ని భావిస్తున్నా అని ప్ర‌సాద్ తెలిపాడు. మ‌రోవైపు జ‌హీర్ ఖాన్ కూడా బౌలింగ్ కోచ్ రేసులో ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. మాజీ కోచ్ కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్‌సింగ్ కూడా జ‌హీర్ పేరును ప్ర‌తిపాదించారు. వెంక‌టేశ్ ప్ర‌సాద్ ప్ర‌స్తుతం జూనియ‌ర్ టీమ్ సెల‌క్ష‌న్ క‌మిటీకి చైర్మ‌న్‌గా ఉన్నాడు. సెప్టెంబ‌ర్‌తో అత‌ని ప‌ద‌వీకాలం ముగుస్తుంది. ప్రసాద్ 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన స‌మ‌యంలో టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అంతేకాదు అండ‌ర్ 19 టీమ్‌కు కోచ్‌గా ఉండి.. 2006 వ‌రల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌కు చేర్చాడు.

1635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles