తడబడుతోన్న సౌతాఫ్రికా..

Wed,June 19, 2019 07:30 PM

Van der Dussen, Miller Look to Up the Ante

బర్మింగ్‌హామ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగుల కోసం సౌతాఫ్రికా పోరాటం చేస్తోంది. కివీస్ బౌలర్ల ఎదురుదాడికి సఫారీ బ్యాట్స్‌మెన్ దగ్గర సమాధానమే లేదు. పదునైన బంతులు విసురుతూ కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. బౌలర్లను ఎదుర్కొని మెరుగైన స్కోరు సాధించేందుకు సఫారీలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆమ్లా(55) అర్ధశతకంతో రాణించగా డుప్లెసిస్(23), మార్‌క్రమ్(38) నిరాశపరిచారు. ప్రస్తుతం 43 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. వాన్‌డర్ డుస్సెన్(40), డేవిడ్ మిల్లర్(17) క్రీజులో ఉన్నారు. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కాగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.


2732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles