మాకు పోటీగా ఎవరైనా బిడ్ వేశారో.. ట్రంప్ వార్నింగ్

Fri,April 27, 2018 06:17 PM

US President Donald Trump warns the nations which are bidding for 2026 Soccer World Cup

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన ైస్టెల్లో ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. 2026 సాకర్ వరల్డ్‌కప్ ఆతిథ్యం కోసం కెనడా, మెక్సికోలతో కలిసి అమెరికా బిడ్ వేస్తున్నది. తమకు వ్యతిరేకంగా ఎవరైనా బిడ్ వేస్తే బాగుండదు అంటూ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతానికి అమెరికా బిడ్‌కు పోటీగా మొరాకో మాత్రమే రేసులో ఉంది. జూన్ 13న మాస్కోలో ఫిఫా 2026 ప్రపంచకప్ ఆతిథ్య దేశాన్ని ప్రకటించనుంది. ఈ సందర్భంగా ట్రంప్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. కెనడా, మెక్సికోలతో కలిసి అమెరికా 2026 వరల్డ్‌కప్ కోసం బిడ్ వేసింది. మా బిడ్‌కు వ్యతిరేకంగా మా సాయం పొందే దేశాలే లాబీయింగ్ చేయడం సిగ్గుచేటు. వాళ్లు మాకు మద్దతివ్వకపోతే.. మేం ఎందుకు ఆ దేశాలకు సాయం చేయాలి అని ట్రంప్ ట్వీట్ చేశారు.


దీనికి మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో కూడా సానుకూలంగా స్పందించారు. మన దేశాల మధ్య విభేదాలు ఉన్నా.. ఫుట్‌బాల్ మనల్ని ఏకం చేస్తుంది. అందరం కలిసి మన బిడ్‌కు మద్దతు తెలుపుదాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై ఫిఫా స్పందించలేదు. అయితే ట్రంప్ మద్దతు తమకు ఉండటంపై ఉత్తర అమెరికా మూడు దేశాల తరఫు బిడ్ వేసిన ప్రతినిధి ఆనందం వ్యక్తంచేశారు. ఉత్తర అమెరికా దేశాల్లో వరల్డ్‌కప్‌కు అన్ని వసతులు ఉన్నా.. జూన్‌లో కచ్చితంగా వాటికే అవకాశం దక్కుతుందని చెప్పలేని పరిస్థితి. మొరాకోకు ఫిఫాలోని ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల గట్టి మద్దతు ఉంది. ఫ్రాన్స్, రష్యాలు కూడా మొరాకోవైపే ఉన్నాయి. అమెరికా చివరిసారి 1994లో సాకర్ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చింది.

2409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles