అంపైర్ ఎరాస్మస్ ఆఫ్ సెంచరీ!

Sat,August 11, 2018 07:37 AM

Umpire Marais Erasmus brings up half century of Tests

లండన్: మైదానంలో ఆటగాళ్లు అర్ధసెంచరీలు చేయడం చూశాం. అంపైర్లు కూడా అర్ధశతకాలు పూర్తిచేస్తారు. తాజాగా ఓ సీనియర్ అంపైర్ కూడా టెస్టుల్లో అర్ధశతకం పూర్తిచేశాడు. లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా అంపైర్ ఎరాస్మస్‌కు ఇది 50వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో 50 టెస్టులకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించిన అంపైర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ ఘనత సాధించిన 17వ అంపైర్ ఎరాస్మస్. 2010లో బంగ్లాదేశ్, భారత్ మధ్య చిట్టగాంగ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎరాస్మస్ తొలిసారి అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు.

ఇది నా జీవితంలో మరచిపోలేని ప్రత్యేకమైన రోజు. అంపైర్‌గా కెరీర్‌లో టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 17వ వ్యక్తిని కావడం సంతోషంగా ఉంది. 2016, 17 సీజన్‌లో వరుసగా రెండుసార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి డేవిడ్ షెప్‌హర్డ్ ట్రోఫీని ఎరాస్మస్ అందుకున్నారు. 53 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఎరాస్మస్ 1913 పరుగులు చేసి, 131 వికెట్లు పడగొట్టాడు. స్టీవ్ బక్‌నర్ అత్యధికంగా 128 టెస్టులకు అంపైరింగ్ చేసి అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో అలీమ్ దార్(120టెస్టులు), రూడీ కోర్జెన్(108), హార్పర్(95), డేవిడ్ షెపహార్డ్(92), బిల్లీ బౌడెన్(84) టాప్‌లో ఉన్నారు.

1397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles