ఐపీఎల్‌లో ఉమేశ్ యాదవ్ అత్యంత చెత్త రికార్డు

Mon,April 16, 2018 06:35 PM

Umesh Yadav has conceded 50+ runs in an IPL match 5 times

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఛేదనలో బెంగళూరు 6 వికెట్లకు 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో రహానె సారథ్యంలోని రాజస్థాన్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 ఓవర్లకు 217పరుగుల భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే.

రహానె జట్టు ఇంత భారీ స్కోరు సాధించడంలో బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ పాత్ర కూడా ఉంది. సీనియర్ పేసర్ అయిన ఉమేశ్.. యువ బౌలర్ల కన్నా పేలవంగా బౌలింగ్ చేసి ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకపోగా 59 పరుగులిచ్చేశాడు. ఇందులో రెండు నోబాల్స్, రెండు వైడ్‌లు ఉన్నాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డును కూడా తన పేరిటి లిఖించుకున్నాడు.

ఐపీఎల్‌లో అతడు 50కిపైగా పరుగులు ఇవ్వడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఒక మ్యాచ్‌లో అత్యధిక సార్లు 50 కన్నా ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో ఉమేశ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అశోక్ దిండా మాత్రం నాలుగుసార్లు 50కిపైగా పరుగులు సమర్పించుకున్నాడు.. తాజాగా ఉమేశ్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

బెంగళూరు ఆడిన సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసిన ఉమేశ్ ఆదివారం మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ వికెట్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 400 పైగా స్కోరు నమోదుకావడం విశేషం.

5015
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS