ఆ ఘనత సాధించిన రెండో బౌలర్ ఉమేశ్

Mon,October 21, 2019 08:05 PM

రాంచి: అంతర్జాతీయ క్రికెట్లో టీమ్‌ఇండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత అందుకున్నాడు. సూపర్‌ఫామ్‌లో ఉన్న ఉమేశ్ అద్భుత బౌలింగ్‌తో కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ భారత్ విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. రాంచీ టెస్టులో పేస్, రివర్స్ స్వింగ్‌తో విజృంభించిన స్పీడ్‌స్టర్ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్, డుప్లెసిస్, లిండేల వికెట్లను తీయడం ద్వారా వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లో 3కు పైగా వికెట్లు తీసిన రెండో అంతర్జాతీయ బౌలర్‌గా నిలిచాడు. గతంలో వెస్టిండీస్ దిగ్గజం కోట్నీ వాల్ష్ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. ఉమేశ్ తన చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 6/88, 4/45, 3/37, 3/22, 3/40లతో గొప్ప గణాంకాలు నమోదు చేయడం విశేషం. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తన బౌలింగ్ శైలిని మార్చుకొని.. బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించేలా బంతులేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 43 టెస్టులాడిన ఉమేశ్ 84 ఇన్నింగ్స్‌ల్లో 130 వికెట్లు తీశాడు. 6/88 అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.

1626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles