ఒకే ఓవర్లో 43 పరుగులు.. వరల్డ్ రికార్డ్.. వీడియో

Thu,November 8, 2018 05:17 PM

Two New Zealand batsmen hit 43 runs in an over sets a new world record

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ బ్రెట్ హాంప్టన్, జో కార్టర్ కొత్త వరల్డ్ రికార్డు సృష్టించారు. ఓ డొమెస్టిక్ వన్డే మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతోపాటు మొత్తం 43 పరుగులు చేశారు. ఈ ఓవర్లో రెండు నోబాల్స్‌తోపాటు ఓ ఫోర్, ఓ సింగిల్ కూడా ఉన్నాయి. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. విలెమ్ లుడిక్ అనే బౌలర్ వేసిన ఓవర్లో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ పరుగుల మోత మోగించారు. అప్పటివరకు 9 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి వికెట్ తీసుకున్న లుడిక్.. పదో ఓవర్ ముగిసే సరికి ఏకంగా 85 పరుగులకు చేరడం విశేషం. ఓవర్ ఫస్ట్ బాల్ యార్కర్ వేసినా.. అది వికెట్ల వెనుక ఫోర్ వెళ్లింది. ఆ తర్వాత రెండు ఫుల్ టాసస్ నడుము కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో అంపైర్ నోబాల్స్‌గా ప్రకటించాడు. ఆ రెండు బంతులనూ హాంప్టన్ సిక్సర్లుగా మలిచాడు. గతంలో లిస్ట్ ఎ వన్డే మ్యాచ్‌లో ఒక ఓవర్లో అత్యధికంగా 39 పరుగులు చేసిన రికార్డు జింబాబ్వేకు చెందిన ఎల్టన్ చిగుంబర పేరిట ఉంది.


8538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles