కుంబ్లేనే మ‌ర‌చిపోతావా.. ఇదేం ప‌ద్ధ‌తిగా లేదు!

Thu,September 7, 2017 04:13 PM

Twitterati not happy with Virat Kohli omitting Anil Kumbles name in his Teachers Day message

న్యూఢిల్లీ: క‌్రికెట‌ర్‌గా, కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఎంత గొప్ప‌వాడైనా.. ఎన్ని రికార్డులు, విజ‌యాలు సాధించినా.. కొన్ని విష‌యాల్లో మాత్రం అత‌ని తీరును అభిమానులు త‌ప్పుబడుతూనే ఉన్నారు. కోచ్‌గా అనిల్ కుంబ్లేను అవ‌మాన‌క‌ర రీతిలో సాగ‌నంప‌డంపై అత‌నిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా విరాట్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌పైనా అలాంటి విమ‌ర్శ‌లే వ‌స్తున్నాయి. టీచ‌ర్స్ డే శుభాకాంక్ష‌లు చెబుతూ.. ఓ ఫొటోను అత‌ను ట్వీట్ చేశాడు. ఆ ఫొటోలో విరాట్ వెనుక కొంద‌రు క్రికెట్ లెజెండ్స్ పేర్లు ఉన్నాయి. అందులో ద్ర‌విడ్‌, ధోనీ, గిల్‌క్రిస్ట్‌, స్టీవ్ వా, వివ్ రిచ‌ర్డ్స్‌, లారా, షాన్ పొలాక్‌, చివ‌రికి మియందాద్ పేర్లు కూడా ఉన్నాయి. త‌న‌ను క్రికెటర్‌ను బాగా ఇన్‌స్పైర్ చేసిన క్రికెట‌ర్ల పేర్ల‌ను ఇందులో ఉంచాడు విరాట్‌. అయితే ఇందులో కుంబ్లే పేరు లేక‌పోవ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్ అయ్యారు. ఇదే పద్ధ‌తిగా లేద‌ని విరాట్ మొహం మీదే చెప్పేశారు. కావాల‌నే కుంబ్లే పేరు తొల‌గించాడ‌నీ కొంద‌రు ఆరోపించారు.
4477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS