కోహ్లి.. కాస్త మీ భార్యకు చెప్పు.. ఆ యాడ్ వద్దని!

Thu,January 17, 2019 12:29 PM

Twitterati not happy with Anushka Sharma promoting Gutkha company Rajanigandha

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. పెటాతో చేతులు కలిపి మాంసాహారాన్ని పక్కన పెట్టాలని ప్రచారం చేస్తున్న ఆమె.. ఇప్పుడు మాత్రం ఇలా ఓ గుట్కా యాడ్‌లో నటించడమేంటని ప్రశ్నిస్తున్నారు. పాన్ మసాలాలు అమ్మే రజనీగంధా సంస్థకు సిల్వర్ పర్ల్స్‌ను అనుష్క ప్రమోట్ చేస్తున్నది. పాన్ మసాలాలతో ఎంతో మందిని నోటి క్యాన్సర్ల బారిన పడేస్తున్న సంస్థను ప్రమోట్ చేస్తావా అంటూ అనుష్కపై నెటిజన్లు మండిపడ్డారు. ఓవైపు ఆమె భర్త కోహ్లి మాత్రం ప్రజలకు కీడు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయనని చెబుతుంటే.. అనుష్క మాత్రం ఇలాంటి సుపారీలను ప్రోత్సహిస్తూ మళ్లీ జనాలకు నీతులు చెబుతుందని ఓ ట్విటర్ యూజర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. చాలా మంచి పని చేస్తున్నారు మేడమ్.. మరి ఇలాగే నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికీ అండగా నిలుస్తారా.. మీరు ఈ యాడ్ చేసిన తర్వాత లక్షల మంది మీ అభిమానులు ఈ పాన్ మసాలాలు తిని అదే క్యాన్సర్ బారిన పడతారు అని మరో యూజర్ ఘాటుగా కామెంట్ చేశారు. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను అనుష్క తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఇలా రియాక్టయ్యారు.
11766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles