ఆ ఇద్దరిపై ఒకే జోక్.. ట్విటర్‌లో ఆడుకుంటున్న ఫ్యాన్స్!

Sun,July 1, 2018 01:02 PM

మాస్కో: ఆ ఇద్దరూ ప్రపంచంలోనే మేటి ఫుట్‌బాలర్స్. ఇద్దరూ ఐదేసిసార్లు ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డును గెలుచుకున్న వాళ్లే. క్లబ్ లెవల్లో చెలరేగి ఆడే ఈ స్టార్ ప్లేయర్స్ తమ టీమ్స్‌కు ఇప్పటి వరకు ప్రపంచకప్‌ను మాత్రం అందించలేకపోయారు. ఈసారి కూడా వరల్డ్‌కప్ నాకౌట్ స్టేజ్ మొదలైన తొలి రోజే ఇద్దరూ ఇంటిదారి పట్టారు. ఈ ఇద్దరిలో ఒకరు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అయితే.. మరొకరు అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ. శనివారం జరిగిన రెండు ప్రిక్వార్టర్స్ మ్యాచుల్లో ఈ ఇద్దరి టీమ్స్ ఓడిపోయాయి. ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా, ఉరుగ్వే చేతిలో పోర్చుగల్ ఓడిపోయి ఇంటిదారి పట్టాయి.


దీంతో వీళ్లతో ఆడుకోవడానికి అభిమానులకు ఓ అవకాశం దొరికింది. అది కూడా ఒకే జోక్‌ను ఒక్కో అభిమాని ఒక్కోలా ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇద్దరూ ఒకేసారి ఓడిపోవడంతో ఒకే రోజు ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకుంటే ఎలా ఉంటుందో చూడండి అంటూ ఫన్నీ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌తార‌నుకున్న ఈ ఇద్ద‌రూ ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో క‌లుసుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్న‌ట్లు ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు. మరీ విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఇప్పటివరకు వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచుల్లో ఒక్క గోల్ కూడా చేయకపోవడం.
3131
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles