ధోనీ ఇక చాలు.. క్రికెట్ అభిమానులు సీరియస్!

Sun,October 28, 2018 12:04 PM

Twitter Erupts In Disappointment after MS Dhoni fails in third ODI

ముంబై: టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై మరోసారి విమర్శల పరంపర మొదలైంది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ధోనీ వరుసగా విఫలమవుతుండటంపై అభిమానులు సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా మూడో వన్డేలో అతడు కేవలం 7 పరుగులకే ఔటవడంతో ఇక చాలు.. రిటైరైపో అంటూ ధోనీపై మండిపడుతున్నారు. ఇప్పటికే అతని చెత్త ఫామ్ కారణంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20ల సిరీస్‌లకు ధోనీని సెలక్టర్లు పక్కన పెట్టేశారు. ఆ మరుసటి రోజే అతను మరోసారి విఫలమవడంపై ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. అతను ఔటవగానే ట్విటర్‌లో తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. ధోనీ ఇప్పటికైనా గౌరవంగా తప్పుకుంటే మంచిది అని సూచిస్తున్నారు. రిటైర్మెంట్ ఎవరికైనా తప్పదని, అదేదో ధోనీ ఇప్పుడే తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.










5083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles