వాళ్లు లెజెండ్స్‌.. ఎందుకిలా అవ‌మానిస్తున్నారు?

Sun,July 16, 2017 03:43 PM

True greats Kumble, Dravid, Zaheer do not deserve public humiliation says Ramachandra Guha

న్యూఢిల్లీ: అనిల్ కుంబ్లే, రాహుల్ ద్ర‌విడ్‌, జ‌హీర్ ఖాన్ నిజ‌మైన లెజెండ్స్ అని.. వాళ్ల‌ను ఎందుకిలా అవ‌మానిస్తున్నారంటూ బీసీసీఐపై మండిప‌డ్డారు క‌మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్స్ మాజీ స‌భ్యుడు రామ‌చంద్ర గుహ‌. వ్య‌క్తిగ‌త కార‌ణాలు చూపుతూ సీఓఏకు రాజీనామా చేసిన గుహ‌.. వెళ్తూ వెళ్తూ బోర్డును తీవ్రంగా విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. కోహ్లి, ధోనీ, టీమ్‌లో సూప‌ర్‌స్టార్ క‌ల్చ‌ర్‌లాంటి అంశాల‌పై గుహ అప్ప‌ట్లో తీవ్రంగా స్పందించారు. తాజాగా అనిల్ కుంబ్లేను అవ‌మాన‌క‌ర రీతిలో కోచ్ ప‌ద‌వి నుంచి సాగ‌నంప‌డం.. ద్ర‌విడ్‌, జ‌హీర్‌ల‌ను క‌న్స‌ల్టెంట్లుగా నియ‌మించినా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వ‌కుండా అవ‌మానించ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. వాళ్లు ముగ్గురూ నిజ‌మైన లెజెండ్స్ అని, ఎందుకిలా వాళ్ల‌ను ప‌బ్లిగ్గా అవ‌మానిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.
2325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles