కేర‌ళ బాధితుల‌కు ఈ విక్ట‌రీ అంకితం: కోహ్లీ

Wed,August 22, 2018 05:08 PM

Trent Bridge victory dedicated to Kerala flood victims, says Virat Kohli

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అయితే జల విలయంతో అతలాకుతలమైన కేరళకు.. ఈ విక్ట‌రీని అంకితం చేసింది టీమిండియా. ఇవాళ ఇంగ్లండ్‌తో టెస్టు ముగిసిన తర్వాత ఈ ప్రకటన చేశారు. ఈ విజయాన్ని కేరళ బాధిత కుటుంబాలకు అంకితం ఇస్తున్నట్లు కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 97, రెండ‌వ ఇన్నింగ్స్‌లో 103 ర‌న్స్ చేశాడు. త‌న ఇన్నింగ్స్‌ను ప్ర‌త్యేకంగా త‌న భార్య అనుష్క‌కు అంకితం చేయాల‌నుకుంటున్న‌ట్లు కోహ్లీ చెప్పాడు. అనుష్క త‌న‌ను ఎంతో మోటివేట్ చేసింద‌న్నాడు. చాలా పాజిటివ్ మైండ్‌తో త‌న భార్య త‌న‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని కోహ్లీ అన్నాడు. ప్ర‌తి టెస్టు మ్యాచ్‌తో.. టీమిండియా మ‌రింత రాటుదేలుతోంద‌న్నాడు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్ రంగాల్లో భార‌త ఆట‌గాళ్లు మెరుగ్గా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని కోహ్లీ అన్నాడు. ఈ టెస్టులో ర‌హానే కీల‌క ఇన్నింగ్స్ ఆడిన‌ట్లు గుర్తు చేశాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో పుజారా ఔట‌న త‌ర్వాత ర‌హానే నిల‌క‌డ ప్ర‌ద‌ర్శించాడ‌న్నాడు.2560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles