వర్షం కారణంగా టాస్ వాయిదా

Tue,June 11, 2019 03:03 PM

Toss Delayed Due to Rain

బ్రిస్ట‌ల్: మెగా టోర్నీలో భాగంగా శ్రీలంక‌, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఉదయం నుంచి అక్కడ వర్షం కురుస్తోంది. చిరుజ‌ల్లులు ప‌డ‌డటంతో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. మ్యాచ్ ఆరంభ స‌మ‌యానికి ముందు వ‌ర్షం ఆగింది. దీంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్‌పై క‌వ‌ర్ల‌ను తొల‌గించారు. అంపైర్లు పిచ్‌, ఔట్‌ఫీల్డ్‌ను ప‌రిశీలించారు.

అయితే మళ్లీ జల్లులు కురుస్తుండటంతో మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు. మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు పూర్తైన త‌ర్వాత ఇరుజ‌ట్ల కెప్టెన్ల‌ను టాస్‌కు ఆహ్వానించ‌నున్నారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మ్యాచ్‌ల‌కు వ‌ర్షం తీవ్రంగా అంత‌రాయం క‌ల్గిస్తోంది. సోమ‌వారం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్‌కు కూడా వ‌రుణుడు అడ్డంకిగా మార‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు.

4650
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles