మెగా టోర్నీలో 'బెస్ట్' క్యాచ్‌లు ఇవే.. చూడండి

Sun,May 27, 2018 04:03 PM

Top  Catches of IPL 2018

ముంబయి: దాదాపు రెండునెలల పాటు క్షణం క్షణం ఉత్కంఠభరితంగా సాగిన ధనాధన్ క్రికెట్ పోరులో ఎన్నో మరుపురాని దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఐపీఎల్-11లో బ్యాట్స్‌మెన్ బౌండరీల మెరుపులు.. బౌలర్లు అబ్బురపరిచే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపి ఆకట్టుకుంటే.. కళ్లుచెదిరే క్యాచ్‌లతో ఫీల్డర్లు కూడా మెగా టోర్నీలో అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఫీల్డర్లు ఊహించని రీతిలో క్యాచ్‌లు అందుకొని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ఫీల్డర్ల అద్భుత విన్యాసాలతో మ్యాచ్ ఫలితాలే మారిపోయాయి. ప్రస్తుత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అందుకున్న క్యాచ్ టోర్నీలో హైలెట్‌గా నిలిచింది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పైడర్ మ్యాన్ తరహాలో అందుకున్న క్యాచ్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజన్‌లో ఇప్పటి వరకు నమోదైన బెస్ట్ క్యాచ్‌లుగా ఇవి టాప్‌లో నిలిచాయి.


2275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles