ఇట్స్ టైమ్ ఫర్.. విరాట్ కోహ్లీ: ఆస్ట్రేలియా గ్రేట్‌

Fri,July 27, 2018 07:05 PM

Time for Virat Kohli to show he can score runs in England: Glenn McGrath

లండన్: టీమిండియా 2014లో చివరిసారిగా ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఆ పర్యటన ముఖ్యంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేదు జ్ఙాపకాలనే మిగిల్చింది. టెస్టు సిరీస్‌లో ఇంగ్లీష్ స్వింగ్ బౌలర్లను ఎదుర్కోలేక 10 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కేవలం 13.50 సగటుతో 134పరుగులు మాత్రమే చేశాడు. ఆతరువాత తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్న విరాట్ ప్రతీ సిరీస్‌లోనూ బౌలర్లకు నిద్రలేని రాత్రులనే మిగిల్చాడు.

సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఆగస్టు 1 నుంచి ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌కు పూర్తిగా సన్నద్ధమయ్యాడు. త్వరలో సుదీర్ఘ సిరీస్‌లో సత్తాచాటేందుకు సిద్ధమైన విరాట్.. తను సాధించాల్సిన లక్ష్యంపై ఆస్ట్రేలియా గ్రేట్ గ్లెన్ మెక్‌గ్రాత్ స్పందించారు. ఇంగ్లాండ్‌లో 2007 తరువాత టెస్టు సిరీస్ నెగ్గాలని భారత్ భావిస్తున్న నేపథ్యంలో అక్కడ పరుగులు సాధించేందుకు విరాట్‌కు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.

విరాట్ ప్రతిచోట రాణించాడు.. ఒక్క ఇంగ్లాండ్‌లో తప్ప. అతను క్వాలిటీ ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్లాస్ ఆటతో అన్ని షాట్లు ఆడతాడు. అతను కొంచెం దూకుడుగా వ్యవహరిస్తాడు కానీ వెనకడుగు మాత్రం వేయడు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లోనూ తాను పరుగులు సాధించగలని నిరూపించే సరైన సమయం ఇదేనని మెక్‌గ్రాత్ తెలిపారు.

4504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles