థ్రిల్లర్ మ్యాచ్.. స్టేడియం ఫుల్

Wed,September 19, 2018 01:28 PM

tickets sold out for India Pakistan match in Dubai

దుబాయ్: ఇండోపాక్ వార్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఎగబడుతున్నారు. ఆసియాకప్‌లో ఇవాళ సాయంత్రం జరిగే మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్దమైంది. ఆ స్టేడియంలో ఉన్న 25వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చాలా రోజుల ముందే స్టేడియంలోని టికెట్లు అన్ని అమ్ముడైనట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం దుబాయ్‌లో విపరీతమైన ఎండలు దంచుతున్నాయి. దీంతో ప్లేయర్లు ఐస్ క్యూబ్‌లతో సేదతీరుతున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇండియా, పాక్ మధ్య మరో మ్యాచ్ సూపర్ ఫోర్ స్టేజ్‌లో జరిగే అవకాశం ఉంది. ఆ మ్యాచ్ ఈనెల 23న ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఒకవేళ రెండు టీమ్‌లు ఫైనల్‌కు వెళ్లినా.. అప్పుడు కూడా మరో హై థ్రిల్లర్ జరిగే వీలుంది. అయితే టోర్నీలో రెండు జట్ల మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగినా..ఆ మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని టికెట్లు అమ్ముడుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇవాళ జరిగే మ్యాచ్‌కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కానీ దుబాయ్ స్పోర్ట్స్ సిటీ అధికారులు మాత్రం ఇమ్రాన్ గురించి సమాచారం లేదన్నారు.2604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles