వింబుల్డ‌న్‌లో మూడు మ్యాచ్‌లు ఫిక్స్‌!

Thu,July 20, 2017 03:34 PM

Three matches in Wimbledon under Investigation of TIU over fixing allegations

లండ‌న్‌: ప‌్ర‌తిష్టాత్మ‌క వింబుల్డ‌న్ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఫిక్స్ అయినట్లు టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్ (టీఐయూ) వెల్ల‌డించింది. ఈ మూడు మ్యాచ్‌ల‌పై తాము విచార‌ణ జ‌ర‌ప‌నున్న‌ట్లు స్ప‌ష్టంచేసింది. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో రెండు, మెయిన్ డ్రాలో ఒక మ్యాచ్ ఫిక్స‌యిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం అందింద‌ని టీఐయూ తెలిపింది. అయితే ఈ మ్యాచ్‌లు ఏవి? ఇందులో ఏ ప్లేయ‌ర్స్ ఉన్నార‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు. మ్యాచ్ అలెర్ట్ పాల‌సీ ప్ర‌కారం ఈ మూడు మ్యాచ్‌ల ఫ‌లితాల‌ను టీఐయూ స‌మీక్షించ‌నుంది. అసాధార‌ణ బెట్టింగ్ ప్ర‌క్రియ కార‌ణంగా ఈ మూడు మ్యాచ్‌ల ఫ‌లితాలు తారుమార‌య్యాయ‌ని ఆ యూనిట్ భావిస్తున్న‌ది. అయితే ఈసారి టోర్నీలో ప‌దిమంది గాయాలు, ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్నారు. వీటిపై మాత్రం ఎలాంటి అలెర్ట్స్ రాలేద‌ని యూనిట్ చెప్పింది. ఫ్రెంచ్ ఓపెన్ స‌మ‌యంలోనూ ఇలాంటి అలెర్ట్సే టీఐయూకి వ‌చ్చాయి. వాటిపై కూడా ఇంకా విచార‌ణ జ‌రుగుతున్న‌ది.

1850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles