గెలవడానికి నలుగురు పేస్‌బౌలర్లు చాలనుకున్నా కానీ..!

Tue,December 18, 2018 12:41 PM

Thought 4 pace bowlers enough to win the game says Virat Kohli

పెర్త్: టీమిండియా బలం స్పిన్. అలాంటిది పెర్త్ టెస్ట్‌కు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను కూడా తీసుకోలేదు. అటు ఆస్ట్రేలియా బలం పేస్ బౌలింగ్. కానీ ఆ టీమ్ నేథన్ లయన్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. విచిత్రంగా చివరికి ఆ స్పిన్నరే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. దీనినిబట్టి కోహ్లి ఎంత తప్పు చేశాడో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. తన పొరపాటును మ్యాచ్ తర్వాత కోహ్లి కూడా అంగీకరించాడు. నలుగురు పేస్‌బౌలర్లతో దిగితే చాలు గెలుస్తామని అనుకున్నాను. పిచ్‌ను చూసినప్పుడే జడేజా పేరును కూడా పరిశీలించలేదు. నేథన్ లయన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. నిజాయతీగా చెప్పాలంటే మేము స్పిన్నర్ గురించే ఆలోచించలేదు అని కోహ్లి మ్యాచ్ తర్వాత చెప్పాడు. అయితే మ్యాచ్ ఓడినా పేస్ బౌలర్లు అంతా బాగానే రాణించారని విరాట్ వెనకేసుకొచ్చాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో పేస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని అతను అన్నాడు. పెర్త్ టెస్ట్‌లో 146 పరుగులతో గెలిచిన ఆస్ట్రేలియా నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు టిమ్ పేన్ తొలి విజయాన్ని అందించాడు.

2682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles