ధోనీతో యువరాజ్ సరదాగా..వీడియో

Wed,January 11, 2017 11:43 AM

ముంబై: టీమిండియాలో యువీ, ధోనీ ఫ్రెండ్‌షిప్ గురించి తెలియ‌ని వాళ్లుండ‌రు. అయితే ఆ మ‌ధ్య ఈ ఇద్ద‌రి మ‌ధ్య చెడింద‌ని, మునుప‌టిలా వీళ్లు క‌లిసి ఉండ‌టం లేద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజాగా సిక్స‌ర్ల కింగ్ యువ‌రాజ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియో ఆ అనుమానాల‌న్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇంగ్లండ్‌తో ఇండియా ఎ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ధోనీ భుజంపై చేయి వేసి యువీ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ఈ సంద‌ర్భంగా ప‌దేళ్ల ధోనీ కెప్టెన్సీపై ఇద్ద‌రూ త‌మ అనుభ‌వాల‌ను షేర్ చేసుకున్నారు. కెప్టెన్సీ భారం దిగిపోయింది.. ఇక పాత ధోనీని మ‌ళ్లీ చూపించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది అని యువీ అన్నాడు.వీడియో చివ‌ర్లో ఇక ఇప్ప‌టి నుంచి ఎన్ని సిక్స‌ర్లు బాదుతావ్ అని స‌ర‌దాగా యువీ అడిగిన ప్ర‌శ్న‌కు ధోనీ స‌మాధాన‌మిచ్చాడు. అది టైమ్‌ను బ‌ట్టి డిసైడ‌వుతా అని మిస్ట‌ర్ కూల్ అన్నాడు. ధోనీని టీమిండియా బెస్ట్ కెప్టెన్‌గా అభివ‌ర్ణించిన యువీ.. అత‌ని కెప్టెన్సీలో ఆడ‌టాన్ని ఎంజాయ్ చేశాన‌ని చెప్పాడు. ధోనీపై ఉన్న కెప్టెన్సీ భారం పోవ‌డంతో ఇక తామిద్ద‌రం స్వేచ్ఛ‌గా ఆడ‌తామ‌ని యువీ ఈ మ్యాచ్‌కు ముందే చెప్పాడు. చెప్పిన‌ట్లే ఈ మ్యాచ్‌లో ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ దుమ్మురేపారు.

2251

More News

మరిన్ని వార్తలు...